Melbourne Test: మెల్‌బోర్న్ టెస్టు ఆస్ట్రేలియాదే...! 4 d ago
అయిదవ రోజు వరకు వచ్చిన బాక్సింగ్ డే టెస్ట్ భారత టీంకు పరాజయం చూపించింది. టీ బ్రేక్ వరకు నిలకడగా ఉన్న రిషబ్ పంత్(30) ఒక బారి షాట్ కు యత్నించి వెనుదిరిగాడు. దాంతో జడేజా(2), నితీష్ కుమార్(1) వరుసగా ఔట్ అయ్యారు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్(84) నిలకడగా కనిపించిన కమిన్స్ వేసిన బౌన్సర్ లో చిక్కేసాడు. మొత్తంగా 155 పరుగులకే టీం ఇండియా ఆల్ అవుట్ అయి, టెస్ట్ ఛాంపియన్‌షిప్ కు అవకాశాలను తగ్గించుకుంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో సిరీస్ 2-1 గా వుంది. 5 వ టెస్టు జనవరి 3 నుండి సిడ్నీ లో జరగనుంది.